AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. దీంతో టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ఆలయానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖుల మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నిన్న ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించలేదు. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.