ys sharmila:ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై (shankar naik) వైఎస్ఆర్ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) విరుచుకుపడ్డారు. తను మానుకోట వచ్చేసరికి ఎమ్మెల్యేకు భయం పట్టుకుందన్నారు. శంకర్ నాయక్ (shankar naik) సైగ చేయ్యు చూద్దాం ఎవడు వస్తాడో చూస్తానని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును (errabelli dayakar rao) కూడా వదల్లేదు. మహబూబ్ బాద్ జిల్లా నెళ్లికుదురు మండల కేంద్రంలో షర్మిల మాట – ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై విమర్శలు గుప్పించారు.
శంకర్ నాయక్‌కు భయం
తాను నెళ్లికుదురులో అడుగుపెట్టగానే శంకర్ నాయక్‌కు (shankar naik) భయం పట్టుకుందని షర్మిల అన్నారు. బెదిరించే దోరణిలో మాట్లాడుతున్నాడని.. ఇదీ మంచి పద్ధతి కాదని సూచించారు. పాదయాత్రను అడ్డుకొనెలా కార్యకర్తలను ఉసి గొల్పుతున్నారని విరుచుకుపడ్డారు. పాదయాత్ర ఎలా చేస్తారో చూస్తా అనే బెదిరించే దోరణిలో మాట్లాడటం ఏంటీ అని అడిగారు. సైగ చేస్తే కార్యకర్తలు దాడి చేస్తారట.. శంకర్ నాయక్‌కి (shankar naik) సవాల్ చేస్తున్నా… దమ్ముంటే దాడి చేయండి చూద్దాం.. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. ప్రజల పక్షాన నిలబడి, కొట్లడుతున్నందుకు భయపడాలా..? అడిగారు. మోసాలు ఎత్తి చూపిస్తున్ననందుకు భయపడాలా..? అని ప్రశ్నించారు. నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలని షర్మిల ధ్వజమెత్తారు.
కబ్జా కోర్
శంకర్ నాయక్ (shankar naik) ఒక కబ్జా కోర్ అని షర్మిల విమర్శించారు. జనాల వద్ద భూములు గుంజుకోడమే తెలుసు అని పేర్కొన్నారు. వైఎస్ఆర్ (ysr) దిమ్మె 8 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే కూల్చేశారు అని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (dayakar rao) గురించి కూడా మాట్లాడారు. ఆడదానికి గొంతు లేదా..? అని అడిగారు. నిన్ను కన్నది ఆడది కాదా..? నీ భార్య ఆడది కాదా..? ఆడది మనిషి కాదా..? అని షర్మిల ప్రశ్నించారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎర్రబెల్లి అని వార్నింగ్ ఇచ్చారు. అవుతాపూర్ (avurapur) గ్రామంలో YSR విగ్రహాన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నం చేశారని గుర్తుచేశారు.
మహిళల లిస్ట్
YSR విగ్రహం ప్రారంభంలో వచ్చిన మహిళలను లిస్ట్ తీయమని అన్నాడట అని పేర్కొన్నారు . పెన్షన్ అపుతడట… ప్రభుత్వ పథకాలు ఆపుతదట అని షర్మిల తెలిపారు. ఎవరి సొమ్ము, మీ పెత్తనం ఏంటీ అని అడిగారు. ప్రజలు బాంచన్ అనాలా… మీ కాళ్ళ దగ్గర సేవ చేయాలా..? అని ప్రశ్నించారు. ఎర్రబెల్లి (errabelli) మీద మేము ఆరోపణలు చేసిన మాట వాస్తవం అని.. దమ్ముంటే పబ్లిక్ ఫోరం పెట్టాలని కోరారు. జర్నలిస్టులను పిలిచి చర్చిద్దామని కోరారు. సుద్ధపూస అయితే నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.