కెజియఫ్ సినిమాతో సంచలనం సృష్టించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరియు హీరో యష్. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. వెయ్యి కోట్లు రాబట్టిన సినిమాల్లో టాప్ త్రీలో నిలిచారు. దాంతో ఈ ఇద్దరికి పాన్ ఇండియా స్థాయిలో ఊహించని స్టార్ డమ్ దక్కింది. అందుకే వీళ్ల అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై ఆరా తీస్తునే ఉన్నారు ఆడియెన్స్. అయితే ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రభాస్‌తో సలార్ తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో 31 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. కానీ యష్ మాత్రం ఇంకా నెక్ట్స్ ప్రాజెక్ట్ కమిట్ అవలేదు. అసలు కెజియఫ్ తర్వాత యష్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు.. దర్శకుడు ఎవరు.. అనే విషయాల్లో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. మధ్యలో ఓ కన్నడ దర్శకుడితో సినిమా ఉంటుందని.. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడని వార్తలొచ్చాయి. కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఈ నేపథ్యంలో యష్ గన్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది కూడా హాలీవుడ్ యాక్షన్ స్టంట్ మాస్టర్ జె.జె.పెర్రి ట్రైనింగ్ ఇస్తున్నట్టు ఆ వీడియో హల్ చల్ చేస్తోంది. దాంతో ఈ కన్నడ రాకింగ్ స్టార్ సైలెంట్‌గా నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్నాడని టాక్. అయితే ఈ గన్ ఫైరింగ్ చూసిన తర్వాత పవర్ ఫుల్ యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నాడని చెప్పొచ్చు. అందుకే ప్రస్తుతం దానికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకుంటున్నాడని అంటున్నారు. మరి యష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందో చూడాలి.