AP: విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. నిన్న ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి బీఆర్టీఎస్ ప్రధాన రహదారిలో ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఎగిరిపోయాయి. అనకాపల్లి జిల్లా సుబ్బవరం మండలం గుల్లేపల్లి అవెన్యూ స్పోర్ట్స్ అవేరా క్రికెట్ మైదానం వర్షానికి పూర్తిగా జలమయమైంది.