AP: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణ పనుల్లో నెలకొన్న స్తబ్దతను తొలగిస్తూ చర్యలు చేపట్టింది. రెండో విడత భూ సమీకరణలో భాగంగా రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు మే 1 నుంచి కౌలు సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి నారాయణ చెప్పారు.