BJP MLC Madhav : రాజకీయ ఎదుగుదలకోసమే కన్నా పార్టీ మార్పు..
BJP MLC Madhav : రాజకీయంగా ఎదగడం కోసం కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ మారరని బీజేపీ ఎమ్మెల్సీ మాదవ్ అభిప్రాయపడ్డారు. కన్నా లక్ష్మీ నారాయణ... బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. తర్వాత ఏ పార్టీలో చేరతారనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ఆ విషయం గురించి తర్వాత చెబుతానని ఆయన అన్నారు. ఈ క్రమంలో... ఆయన పార్టీ వీడటంపై బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు.తాజాగా ఎమ్మెల్సీ మాధవ్ కూడా స్పందించారు.
రాజకీయంగా ఎదగడం కోసం కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ మారరని బీజేపీ ఎమ్మెల్సీ మాదవ్ అభిప్రాయపడ్డారు. కన్నా లక్ష్మీ నారాయణ… బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. తర్వాత ఏ పార్టీలో చేరతారనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ఆ విషయం గురించి తర్వాత చెబుతానని ఆయన అన్నారు. ఈ క్రమంలో… ఆయన పార్టీ వీడటంపై బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు.తాజాగా ఎమ్మెల్సీ మాధవ్ కూడా స్పందించారు.
కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేయడం దురదృష్టకరమని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. వ్యక్తిగత విభేదాలు కారణంగా నాయకులు పార్టీని వీడటం, తిరిగి చేరడం సాధారణమైన విషయమేనని అభిప్రాయపడ్డారు. కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాను పెద్ద విషయంగా చిత్రీకరించే ప్రయత్నం చెయ్యవలసిన అవసరం లేదని అన్నారు. రాజకీయ ఎదుగుదల కోసం పార్టీ మారినట్టు కనిపిస్తోందని, పార్టీ మారే వాళ్ళు చేసే ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం జనసేనతో కలిసి పనిచేస్తున్నామని…ఆ మైత్రి కొనసాగుతుందని స్పష్టం చేశారు.
గత కొన్ని వారాలుగా తన నిరసన గళాన్ని వినిపిస్తున్న కన్నా లక్ష్మీ నారాయణ, బీజేపీకి దూరమౌతున్నట్లు సంకేతాలు పంపారు. ఢిల్లీలో జరిగిన సమావేశాలకు గైర్హాజరయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన పార్టీ పెద్దలను కూడా కవలకుండా దూరంగా ఉన్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రేమ కురిపించారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తానని అన్నారు. ప్రస్తుతానికి కన్నా అంచనాలన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. దీంతో రాజీనామా చేసి తన భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమౌతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒక రెండు రోజుల్లో ఆ విషయంలో స్పష్టమైన ప్రకటన కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది.