Naga Chaitanya : అక్కినేని బ్రదర్స్ అఖిల్, నాగ చైతన్య.. ఇద్దరు కూడా ప్రస్తుతం మాస్ సినిమాలే చేస్తున్నారు. అఖిల్ 'ఏజెంట్' మూవీ చేస్తుండగా.. చైతూ 'కస్టడీ' అనే సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు 'కస్టడీ' తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పై నాగ చైతన్య భారీ ఆశలు పెట్టుకున్నాడు.
అక్కినేని బ్రదర్స్ అఖిల్, నాగ చైతన్య.. ఇద్దరు కూడా ప్రస్తుతం మాస్ సినిమాలే చేస్తున్నారు. అఖిల్ ‘ఏజెంట్’ మూవీ చేస్తుండగా.. చైతూ ‘కస్టడీ’ అనే సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ‘కస్టడీ’ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పై నాగ చైతన్య భారీ ఆశలు పెట్టుకున్నాడు. గతేడాది వచ్చిన బంగార్రాజు, థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా.. సినిమాలతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు చైతన్య. అందుకే కసితో కస్డడీ మూవీ చేస్తున్నాడు. దీంతో పాటు ‘దూత’ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. కానీ ఈ సిరీస్ ఏమైందో ఎవరికి తెలియదు. అయితే తెలుగు, తమిళ్ బై లింగ్వల్ ఫిల్మ్ ‘కస్టడీ’ మాత్రం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. మే 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ సాంగ్ షూట్ చేస్తున్నారట. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతోందట. అయితే ఎన్నడూ లేని విధంగా.. ఈ సాంగ్ కోసం భారీ సెట్టింగులు వేసినట్టు తెలుస్తోంది. ఏకంగా ఏడు సెట్స్ వేశారట. ఈ మధ్య కాలంలో ఒక్క పాటకు అన్ని సెట్స్ వేయలేదని అంటున్నారు. కానీ వెంకట్ ప్రభు మాత్రం తగ్గేదేలే అంటున్నారట. ఈ సాంగ్‌ను నాగ చైతన్య, కృతి శెట్టిపై చిత్రీకరిస్తున్నారట. గతంలో ఈ ఇద్దరు కలిసి బంగార్రాజు సినిమాలో నటించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. అందుకే కస్టడీలోను ఈ పెయిర్ ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. మరి కస్టడీతో చైతన్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.