AKP: పాయకరావుపేట ఎంపీడీవో లవరాజుకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్తు కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, సీఈవో నారాయణమూర్తి పురస్కారాన్ని అందజేశారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. ఈ పురస్కారంతో బాధ్యతలు మరింత పెరిగాయని అన్నారు. ప్రజా ప్రతినిధులు నాయకుల సమన్వయంతో అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.