NZB: క్షయ వ్యాధిని నివారించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ అన్నారు. ధర్పల్లి మండలం హోన్నాజీపేట్ గ్రామంలో మంగళవరం ఆయన మాట్లాడారు. హోన్నాజీపేట్ గ్రామపంచాయతీ కార్యాలయంలో క్షయ వ్యాధి లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. పాటించవలసిన జాగ్రత్తలను తెలియజేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఉన్నారు.