నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో CSK అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అకీల్ హోసేన్ తన స్పిన్ మాయాజాలంతో 4/17 అద్భుతంగా రాణించి.. ముంబై పతనాన్ని శాసించాడు. అయితే, యువ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ఈ మ్యాచ్ తర్వాత మొత్తం 14 వికెట్లతో మళ్లీ పర్పుల్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే అకీల్ హోసేన్ ఆ క్యాప్‌ను అన్షుల్ కాంబోజ్‌కు అందజేసి అభినందించాడు.