భారత్ – చైనా సరిహద్దు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో 2020 ఏప్రిల్‌కి ముందు నాటి పరిస్థితులు ఉండాలని భారత్ కోరుకుంటోందని ఆయన అన్నారు. ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. బఫర్‌జోన్‌లోకి సైనిక బలగాలు చొరబడకపోతేనే శాంతిస్థాపన సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.