కృష్ణా: అనకాపల్లి జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ మంగళవారం విజయవాడలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణను కలిశారు. తన నియోజకవర్గంలోని ప్రయాణికుల సౌకర్యార్థం పెందుర్తి మీదుగా పలు ప్రాంతాలకు బస్సులు నడపాలని పంచకర్ల నారాయణను కోరారు. పెందుర్తి నుంచి కాకినాడ, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడపాలని పంచకర్ల ఈ మేరకు కొనకళ్లకు వినతిపత్రం అందించారు.