అమెరికా ఎన్నికల ప్రచారంలో కమలా హారిస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ గెలిస్తే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళ్లి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో కూర్చుంటారని అభిప్రాయపడ్డారు. దురాక్రమణదారుడికి వ్యతిరేకంగా చేస్తోన్న పోరాటంలో ఉక్రెయిన్ లొంగిపోయేలా ట్రంప్ చేస్తారంటూ వ్యాఖ్యానించారు. కాగా, హారిస్ గతంలోనూ ట్రంప్ గురించి ఈ తరహా విమర్శలు చేసిన విషయం తెలిసిందే.