AP: రాష్ట్ర వ్యాప్తంగా మద్యం తయారీ కేంద్రాలు, విక్రయ దుకాణాల్లో సీఐడీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం అమ్మకాల్లో అవకతవకలపై ఆయా డిస్టిలరీస్‌లో ఆరా తీస్తున్నారు. నంద్యాలలోని డిస్టిలరీస్‌లో సీఐడీ ఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఎంత మద్యం తయారు చేశారు? ఎంత విక్రయించారు..? రికార్డులు సక్రమంగా ఉన్నాయా..? నిల్వల్లో ఏమైనా తేడా ఉందా..? అనే వివరాలతో అధికారులు పరిశీలిస్తున్నారు.