TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై రేపటి నుంచి మళ్లీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇంజినీర్లు, విశ్రాంత ఇంజినీర్లు, ఉన్నతాధికారులను న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ విచారించనున్నారు. గతంలో విచారణ చేసిన వారిని కూడా మళ్లీ పిలవనున్నారు. ఈనెల 29 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనుంది. ఇవాళ నీటిపారుదలశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా తుది నివేదిక ఇవ్వాలని డీజీని ఘోష్ ఆదేశించారు.