NZB: రచయితల సంక్షేమం కోసం కృషి చేయాలని సామాజిక రచయితల సంఘం అధ్యక్షులు ప్రేమ్ లాల్ కోరారు. జిల్లా కేంద్రంలోని హరిచరణ్ మార్వాడి విద్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రచయితల కోసం, కవుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. తెలంగాణ ఏర్పాటులో రచయితల స్థానం ఎంతో ఉందని అన్నారు.