చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రత్యర్థి నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో బ్యాటర్లు తడబడుతుండటంతో.. 13 ఓవర్లలో 87/6 స్కోర్ మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో సూర్య(36), శార్దుల్(0) ఉండగా.. విజయం కోసం మిగిలిన 42 బంతుల్లో 121 రన్స్ చేయాల్సి ఉంది. చెన్నై బౌలర్లలో అకీల్ హుసేన్ 3, నూర్ అహ్మద్ 2, ముకేష్ ఓ వికెట్ పడగొట్టారు.