టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘క’. ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 24న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుజిత్, సందీప్‌లు ఈ సినిమాను తెరకెక్కించగా.. నయన్ సారిక, తన్వి రామ్ హీరోయిన్స్‌గా నటించారు.