MDK: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బస్సుల సేవలు నిరంతరం కొనసాగేందుకు జిల్లాలోని బస్టాండ్ల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. గురువారం పట్టణంలోని బస్టాండును సందర్శించారు. ఎలాంటి అవాంఛనియ ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. బస్సులపై దాడి చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.