IPL-2026లో ఇంగ్లండ్ ప్లేయర్ బెతెల్‌ను RCB కొనుగోలు చేసింది. అతడికి ఇప్పటి వరకు ఆడే అవకాశం రాకపోవడంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ స్పందిస్తూ.. ఇంగ్లండ్ వెళ్లిపోవాలని సూచించాడు. కానీ, దీనిపై మరో మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్.. బెతెల్‌ను ఇక్కడే ఉండమని చెప్పాడు. అంతర్జాతీయ ఆటగాళ్లతో ఉండే అవకాశం IPLతో సాధ్యమని, ఈ విషయంలో కుక్కు ఏమీ తెలియదని అన్నాడు.