MBNR: భగీరథ మహర్షి ఆశయాలను కొనసాగిద్దామని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. ఇవాళ భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ.. భగీరధుడు కఠోర దీక్షకు పట్టిన పట్టును విడవని వాడిగా గుర్తింపు పొందాడని వెల్లడించారు.