బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్‌లో టీకాల తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా భారీగా పెట్టుబడులు పెట్టనున్నారు. ఆయన నేతృత్వంలోని ‘సెరెనె ప్రొడక్షన్స్’ సదరు కంపెనీలో రూ. 1000 కోట్ల పెట్టుబడి పెట్టి.. 50% వాటాలను కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని ఇరు సంస్థలు ఓ ప్రకటనలో వెల్లడించాయి.