మెదక్: జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజోల్ గ్రామానికి చెందిన చాకలి బక్కప్పకి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలుసుకున్న ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.1,25,000 ఎల్వోసీ మంజూరు చేయించారు. ఎల్వోసీ పత్రాన్ని బక్కప్ప కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మాణిక్ రావు అందజేశారు. వారితో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.