కృత్రిమమేధ ఉద్యోగుల పాలిట శాపంగా మారుతుంది. వివిధ కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగుల కార్యకలాపాల స్థానంలో ఏఐని వాడడం ప్రారంభించాయి. దాంతో ఆయా స్థానాల్లోని ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఏఐ వాడకంతో థర్డ్ పార్టీ ఆన్ లైన్ పేమెంట్ సేవల సంస్థ ఫోన్ పే తన కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ కార్యకలాపాల్లో గత ఐదేళ్లలో 60 శాతం ఉద్యోగులను తొలగించింది. ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారని కొందరు నిపుణులు భావిస్తున్నారు.