AP: విశాఖలోని రుషికొండ భవనాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా పరిశీలించారు. విజయనగరం పర్యటన ముగించుకుని విశాఖ విమానాశ్రయానికి బయల్దేరారు. ఈ క్రమంలో మధ్యలో రుషికొండ భవనాల వద్ద ఆగారు. అక్కడ కాసేపు రుషికొండ నిర్మాణాలను పరిశీలించారు. అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విశాఖ విమానాశ్రయానికి వెళ్లారు.