HYD: భర్తతో గొడవపడి ఓ భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన నాగోల్ పోలీస్ స్టేషన్లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రవీణ్ కుమార్ స్వాతి దంపతులు శనివారం రాత్రి గొడవపడ్డారు. దీంతో స్వాతి భర్తకు తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ప్రవీణ్ చుట్టుపక్కల వెతికినా, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినా జాడ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.