HYD: బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్ లో మైనారిటీ ఉపాధ్యక్షులు సలీం ఆధ్వర్యంలో “గ్యార్మీ షరీఫ్” ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.