AP: వైసీపీ మాజీమంత్రి పినిపే విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలను మంత్రి వాసంశెట్టి సుభాష్ ఖండించారు. ‘విశ్వరూప్ కుమారుడి విషయంలో చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. గత ప్రభుత్వంలో వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసు మూసేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకే నేను బాధితుల్ని DGP, IGల వద్దకు తీసుకెళ్లాను. శ్రీకాంత్‌కు వాలంటీర్ దుర్గాప్రసాద్ ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు’ అని పేర్కొన్నారు.