MDK: సింగూర్ మధ్యతరహా ప్రాజెక్టుకు వరద పెరిగింది. దాంతో ప్రాజెక్టు ఒక్క గేటు ఓపెన్ చేసి దిగువకు వరద నీళ్లు వదిలినట్లు ఏఈ మహిపాల్ రెడ్డి సోమవారం సాయంత్రం తెలిపారు. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు 12వేలు క్యూసెక్కుల వరద వస్తోందని చెప్పారు. గేటు నెంబర్ 6 ద్వారా 2 మీటర్ల ఎత్తులో దిగువకు 13,471 క్యూసెక్కులు వదిలినట్లు చెప్పారు.