మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ ‘రాజా సాబ్’. ఈ మూవీ నుంచి ప్రభాస్ కొత్త పోస్టర్ను దర్శకుడు మారుతి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇందులో గళ్ల కోటు, నల్ల ప్యాంట్, కళ్ల జోడు పెట్టుకుని ప్రభాస్ స్టైలిష్గా కనిపిస్తున్నాడు. కాగా అతడి పుట్టినరోజు సందర్భంగా ఈనెల 23న రాజా సాబ్ సినిమా టీజర్ విడుదల కానుంది.