హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ కథా చిత్రం ‘ప్యూరియోసా ఎ మ్యాడ్ మ్యాక్స్’ చిత్రం సమ్మర్ స్పెషల్గా మే 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సుమారు ఆరు నెలల తర్వాత ఓటీటీలో విడుదల కానుంది. అక్టోబర్ 23 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు జియో సినిమా వెల్లడించింది. తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళం, బెంగాళీ, మరాఠీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుందని జియో పేర్కొంది.