TG: BRS హయాంలో కమీషన్లు వచ్చే పనులే చేశారని MLA కడియం శ్రీహరి ఆరోపించారు. జనగామ జిల్లా మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న కడియం.. BRS హయాంలో ప్రజలకు ఉపయోగపడే పనులు జరగలేదన్నారు. కల్వకుంట్ల కుటుంబం పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుందని, 2014లో కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎంత.. ఇప్పుడెంత అని ప్రశ్నించారు. నీతిమంతులైతే ఆస్తుల వివరాలు వెల్లడించాలని కడియం డిమాండ్ చేశారు.