TG: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూల్లో పోలీసుల పిల్లలకు విద్య అందించనున్నారు. కాగా.. ఇటీవల పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కూల్ ప్రారంభించనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.