ఏపీ హైకోర్టులో నటుడు అల్లుఅర్జున్ తాజాగా పిటిషన్ వేశారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని(కొట్టివేయాలని) పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కేసు రేపు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.