KMR: మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలోని, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఆవరణలో దాతల సహకారంతో నిర్మించిన, కాలక్షేప మండపాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి, పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ కమలాకర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.