AP: విశాఖలోని రుషికొండ గీతం ఎదుట వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. గీతం నుంచి ప్రభుత్వ భూములు కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. వేల కోట్ల భూములు బోగస్ కంపెనీలకు కట్టబెడుతున్నారని వైసీపీ నేత కేకే రాజు మండిపడ్డారు. ఎంపీ భరత్‌కు రూ.5 వేల కోట్ల భూములు కట్టబెట్టారని ఆరోపించారు.