TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కమిషన్ ఏర్పాటు సరైందేనని కోర్టు అంగీకరించిందని, నోటీసుల అంశం కేవలం సాంకేతిక కారణమేనని తెలిపారు. సీబీఐ విచారణకు ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. రూ.లక్ష కోట్ల ప్రాజెక్ట్ మూడేళ్లకే దెబ్బతినడానికి డిజైన్, నిర్మాణ లోపాలే కారణమని ఘోష్ నివేదికలో వెల్లడైందని పేర్కొన్నారు.