TG: కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ధర్మం గెలుస్తుందని నిరూపితమైందన్నారు. హైకోర్టు తీర్పుతో.. రేవంత్ రెడ్డి రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయన్నారు. ఇప్పటికైనా రాజకీయ కక్ష సాధింపులు ఆపి.. కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేయాలని చెప్పారు. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరమన్నారు.