బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, సమంత కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్ని’. సిరీస్ ప్రచారంలో భాగంగా వరుణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సమంతతో పని చేయవద్దని చాలామంది సినీ ప్రముఖులు తనకు చెప్పినట్లు వెల్లడించారు. కాగా, సిటాడెల్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.