AP: సచివాలయ సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. గత ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో, ఆయనను ప్రభుత్వ సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విచారణ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ కఠిన చర్య తీసుకుంది.