MLG: గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామానికి చెందిన చెరుకుల మల్లేష్‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కును రాష్ట్ర మంత్రి సీతక్క అందజేశారు. ములుగు క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. లబ్ధిదారుడు కుటుంబంతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బానోతు రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.