MLG: విజన్ స్కూల్ విద్యార్థులు వెంకటాపురం పోలీస్ స్టేషన్ను సందర్శించగా ఎస్సై తిరుపతిరావు పోలీస్ శాఖ విధులపై అవగాహన కల్పించారు. రోడ్డు సేఫ్టీ, చట్టాల గౌరవంపై సూచనలు చేశారు. విద్యార్థులతో పరస్పర చర్చ నిర్వహించి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, లక్ష్య సాధనపై ప్రేరణాత్మక సందేశాలు అందించారు. బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు.