AP: తూ.గో జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా అఖండ గోదావరి మహా పుష్కరాలు-2027 పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రాజమండ్రిలో భూగర్భ కేబుల్ వ్యవస్థ, రివర్ వ్యూ ఎస్ఎస్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు భూగర్భ కేబుల్ వ్యవస్థకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందులు దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు.