AP: విజయవాడలోని విజయకీలాద్రిపై ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. శ్రీవిఘ్నవిమోచక హనుమాన్కు మహోత్సవం నిర్వహిస్తున్నారు. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో 108 కలశాలతో అభిషేక మహోత్సవం, అర్చనలు, పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు.