కృష్ణా: నందివాడ మండలం తమ్మిరస గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తోట నాగరాజు ఆదివారం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి చేరారు. ఆయనకు వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి శశిభూషణ్, తోట నాగరాజుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తోట నాగరాజు వంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు వైసీపీలో చేరడం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని శశి భూషణ్ అన్నారు.