మహబూబ్నగర్ జిల్లాలో నేటి నుంచి పదో తరగతి & ఇంటర్మీడియట్ (తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ) పరీక్షల నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నిపరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి. జానకి ఆదివారం తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని తెలిపారు.