కోనసీమ: రాజోలు నియోజకవర్గంలో కాలువలు, డ్రైన్ల నిర్వహణ పనులకు ప్రభుత్వం రూ.3.50 కోట్లు కేటాయించిందని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వీటిలో పూడిక తీతకు రూ.1.50 కోట్లు, కాంక్రీట్, షట్టర్ల మరమ్మతులకు రూ.కోటి, డ్రైన్లలో తూడు, గుర్రపు డెక్క తొలగింపునకు రూ.కోటి కేటాయించిందని చెప్పుకొచ్చారు.