CTR: ఎస్ఆర్ పురం పాయకట్టులో శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల కళ్యాణం ఆదివారం ఘనంగా జరిగింది. అర్చకులు మంత్రోచ్ఛారణల మధ్య వివాహ తంతును నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉభయదారులుగా వ్యవహరించిన కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదానం చేపట్టారు.