SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. అకస్మాత్తుగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొంతసేపు వీధులు తడిసి ముద్దయ్యాయి. ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపగా సాయంత్రం కురిసిన వర్షంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. వర్షంతో వాహనదారులు పాదచారులు ఇబ్బందులు పడ్డారు.