NDL: బనగానపల్లె పంచమపేటలో పీఎం సూర్యఘర్ ఉత్సవ్ శిలాఫలకాన్ని మంత్రి జనార్దన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు 100% రాయితీతో, ఇతరులకు 40% వరకు సబ్సిడీతో సోలార్ ప్యానెల్లు అందిస్తామన్నారు. నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుందని చెప్పారు. అదనపు విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయిస్తుందని, దీంతో పేద కుటుంబాలపై భారం పడదన్నారు.